Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

విద్యార్థి మృతికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి

Updated : 23 Aug 2026 19:15 IST
As Preferred Source 1 min read
విద్యార్థి మృతికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి

నారాయణఖేడ్ జూకల్ శివారులోని శంకరంపేట మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్‌లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందడంపై సమగ్ర విచారణ చేపట్టి, విద్యార్థి మృతికి కారణమైన హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు డిమాండ్ చేశారు. హాస్టల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. హాస్టల్‌లో విద్యార్థులకు సరైన భోజనం, వసతులు కల్పించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో కూడా హాస్టళ్లలో పలు సమస్యలు వచ్చినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.అధికారులు అన్ని హాస్టళ్లను క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని, వారికి మెరుగైన భోజనం, వసతులు, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మృత విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు గణపతి, రాహుల్, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థి మృతికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి