Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:58 PM

నల్లగొండను ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే నా ధ్యేయం...

23-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...

రూ. 2 కోట్లతో నిర్మించిన నల్లగొండ క్లబ్ అదనపు భవనాల ప్రారంభం...

రూ. 125 కోట్లతో 24 గంటల తాగునీటి సరఫరా హామీ...

నల్లగొండ : నల్లగొండ పట్టణాన్ని 'సూపర్ స్మార్ట్ సిటీ'గా మలచడంతో పాటు, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని నల్లగొండ క్లబ్‌లో రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నల్లగొండ క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్ తరహాలో దీనిని మరింత ఆధునీకరిస్తామని చెప్పారు. క్లబ్ విస్తరణకు వీలుగా పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని కేటాయించేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

రూ. 5 వేల కోట్లకు చేరిన ఎస్ఎల్బీసీ వ్యయం...

నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఎస్ఎల్‌బీసీ (SLBC) సొరంగ మార్గం పనులను వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. గతంలో రూ.2 వేల కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.5 వేల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల సహకారంతో నిధులు సమకూర్చుకుని పనుల్లో వేగం పెంచామన్నారు. ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రూ. 1,400 కోట్లతో రహదారుల అభివృద్ధి...

పట్టణ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి వివరించారు..నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.125 కోట్లతో పనులు జరుగుతున్నాయని, మరో ఆరు నెలల్లో వీటిని పూర్తి చేస్తామని చెప్పారు. రూ.900 కోట్ల అంచనా వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా పట్టణంలో ప్రస్తుతం రూ.1,400 కోట్ల విలువైన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.300 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు నిర్మిస్తామన్నారు. నేషనల్ ఫండ్ ద్వారా మరో రూ.15 కోట్లు వెచ్చించి రహదారులను పరిశుభ్రంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రూ.2,500 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

విద్యారంగానికి ప్రత్యేక నిధులు...

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బొట్టుగూడ పాఠశాల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. పాత టౌన్ పరిధిలో రూ.10 కోట్లతో త్వరలోనే అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెస్తామని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్, ఫౌండేషన్ కోర్సుల సౌకర్యం కల్పిస్తామని హామీ

Sthanikam

నల్లగొండను ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే నా ధ్యేయం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News