Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

వర్షాల కోసం కప్పకాముడు

వర్షాల కోసం కప్పకాముడు

వర్షాల కోసం కప్పకాముడు
23-08-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ చిట్యాల మండలం నేరడ గ్రామపంచాయతీ పరిధిలోని సూదిరెడ్డిగూడెం గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా కప్పకాముడు కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులతో కలిసి గ్రామస్థులు కప్పకాముడు ఆడుతూ, సంప్రదాయ పాటలు పాడుతూ వరుణదేవుడిని వేడుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గతంలో ఈ సమయానికి విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకునేవని తెలిపారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వేసినా నీరు పడని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావంతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను చూసి దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని కప్పకాముడు నిర్వహించి ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూది రెడ్డి వసంత, మెండే కేతమ్మ, ఈశ్వరమ్మ, జాల పద్మ, మంజుల, పద్మ, చిరబోయిన జయమ్మ, శోభ, సువర్ణ, పర్వతమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వర్షాల కోసం కప్పకాముడు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News