Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

టీబీ క్షయ బాధితులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ

22-08-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లయన్స్ క్లబ్, డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు

క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు శరీరానికి అవసరమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్‌ఓ ఎం. మనోహర్ తెలిపారు. చౌటుప్పల్‌లోని సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా అధ్యక్షతన, చౌటుప్పల్ డాక్టర్స్ అసోసియేషన్, బద్దం లింగారెడ్డి సౌజన్యంతో టీబీ బాధితులకు శనివారం పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్‌ఓ మనోహర్ మాట్లాడుతూ.. నిరుపేద టీబీ రోగుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో పోలియోను ఏ విధంగా నిర్మూలించామో, సమిష్టి కృషి ద్వారా టీబీ రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజర్ వంశీ, లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు, ట్రస్టు కార్యదర్శి మోగుదాల రమేష్ గౌడ్, కోశాధికారి గోశిక కరుణాకర్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అతః పాషా, చౌటుప్పల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరావు, డాక్టర్ అవ్వారి శ్రీనివాస ప్రసాద్, డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ కాటంరాజు, దాచేపల్లి రాజు గుప్తా, బత్తిని రఘు గౌడ్, బద్దం లింగారెడ్డి, కాసుల వెంకటేశం, వేముల నరసింహ, కొసనం రాంరెడ్డి, కటకం ప్రశాంత్, నాంపల్లి రమేష్, లక్ష్మణ్ గౌడ్, సిలివేరు మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టీబీ క్షయ బాధితులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News