ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వకుండా మహిళను వేధిస్తున్ననల్గొండ డిప్యూటీ తాసిల్దార్..
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వకుండా మహిళను వేధిస్తున్ననల్గొండ డిప్యూటీ తాసిల్దార్..
NM Yadav
అక్రమాల నిలయంగా డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయం...
లీగల్ హేర్ సర్టిఫికెట్ కోసం బాధిత మహిళకు వేధింపులు...
సీఎం ప్రజావాణి, జిల్లా మంత్రి ఆదేశాలూ బేఖాతరు...
ఆర్ డి ఓ ఆఫీస్ లో మాట్లాడుకుందాం రమ్మని చెప్పి బాధ్యత మహిళపై సొంత పిన్ని తో దాడి చేయించిన డిప్యూటీ తాసిల్దార్..
నల్లగొండ రెవెన్యూ శాఖలో తీవ్ర కలకలం..
నల్లగొండ: అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! ప్రజాసేవ చేయాల్సిన రెవెన్యూ అధికారులు అరాచకానికి తెరలేపారు. భర్తను కోల్పోయి, కారుణ్య నియామకం కోసం నిరీక్షిస్తున్న ఒక బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి, డిప్యూటీ తహసీల్దార్ (డిటి) అడ్డగోలు వేధింపులకు గురిచేస్తున్న ఉదంతం నల్లగొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. తొమ్మిది నెలలుగా ఫ్యామిలీ మెంబర్ (లీగల్ హేర్) సర్టిఫికెట్ కోసం కార్యాలయం చుట్టూ తిప్పించుకోవడమే కాకుండా, కమిట్‌మెంట్ ఇవ్వాలని, లేకపోతే సర్టిఫికెట్ ఇవ్వనంటూ సదరు అధికారి వేధించడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే...
త్రిపురారం ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించిన రాయపురం మహేష్, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతి చెందడంతో భార్య కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం నల్లగొండ ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తును పరిశీలించాల్సిన డిప్యూటీ తహసీల్దార్, తీవ్ర నిర్లక్ష్యంతో ఆ ఫైలును బాధితురాలి ముందే విసిరిపారేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సీఎం ప్రజావాణి, జిల్లా మంత్రి ఆదేశాలూ బేఖాతరు...
బాధితురాలు గత మార్చి 10, 2026న హైదరాబాద్‌లోని 'సీఎం ప్రజావాణి'లో కూడా తన ఆవేదనను తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు. సదరు దరఖాస్తును పరిశీలించిన ప్రజావాణి అధికారులు, ఘటనపై విచారణ జరిపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నల్లగొండ ఎమ్మార్వోను పిలిపించి, వెంటనే బాధితురాలికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం, ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం రెవెన్యూ అధికారులు ఏమాత్రం లెక్కచేయకపోవడం గమనార్హం.