Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:41 AM

ఉద్యమ కెరటం సురవరం సుధాకర్‌రెడ్డికి ఘన నివాళి

22-08-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా ఉద్యమాల కోసం జీవితాంతం పోరాడిన కామ్రేడ్‌ సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, మండల కార్యదర్శి గాదెగాని మాణిక్యం తదితరులు సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా బోలగాని సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించిన సురవరం సుధాకర్‌రెడ్డికి నల్లగొండ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. నల్లగొండ గడ్డ నుంచే అనేక వామపక్ష ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు.

నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, ఎస్‌ఎల్‌బీసీ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ, డిండి ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం సాగించారని కొనియాడారు.

సీపీఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్‌రెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ ప్రజల పక్షాన నిలిచిన ఉద్యమ నాయకుడని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు, మండల కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, బోళ్ల శీను, బీరకాయల మల్లేష్‌, మాజీ సర్పంచ్‌ బుగ్గ శ్రీశైలం, లక్ష్మీనారాయణ, పల్లె శీను, ఎండీ శంషుద్దీన్‌, సూదగాని వెంకన్న, జీవికలపల్లి పాండు, జీవికలపల్లి గణేష్‌, ఏఐవైఎఫ్‌ మండల అధ్యక్షుడు బీరకాయల మధు, గట్టి కొప్పుల శ్రీకాంత్‌, యాదగిరి, కర్రే సిద్ధులు, కట్కూరి దయాకర్‌, బొట్ల ఆంజనేయులు, బొట్ల యాదయ్య, వంగపల్లి మచ్చి యాదయ్య, బోనగిరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఉద్యమ కెరటం సురవరం సుధాకర్‌రెడ్డికి ఘన నివాళి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News