Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

సమ్మక్క–సారలమ్మ వీరగాథపై పాన్‌ ఇండియా సినిమా

21-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: తెలంగాణ ఆరాధ్య వనదేవతలు సమ్మక్క–సారలమ్మ వీరగాథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మాస్ట్రో క్రియేషన్స్‌ సన్నాహాలు చేస్తోంది. నిజ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందనున్న ఈ చిత్రం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, వీరత్వం, భావోద్వేగాలను వెండితెరపై అద్భుతమైన విజువల్‌ అనుభూతిగా ఆవిష్కరించనుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట్‌ మాట్లాడుతూ.. సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌, ప్రీ-విజువలైజేషన్‌, వర్చువల్‌ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌ వంటి కీలక విభాగాల్లో నైపుణ్యం కలిగిన యూకే, అమెరికా తదితర దేశాలకు చెందిన ప్రముఖ స్టూడియోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.

సమ్మక్క–సారలమ్మ పాత్రలకు ప్రతిష్ఠాత్మక నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రాబోయే సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమయానికల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, బడ్జెట్‌ తదితర పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Sthanikam

సమ్మక్క–సారలమ్మ వీరగాథపై పాన్‌ ఇండియా సినిమా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News