Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూపా రెడ్డి హత్యకు నిరసనగా కదిలిన విద్యా సమాజం నల్లగొండలో TRSMA ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ.. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 12:00 AM

ప్రజల ముంగిటకే పాలన.. ప్రతి ఇంటి సమస్యను తెలుసుకున్న కలెక్టర్

21-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

లోక్యతండలో ఇంటింటి పర్యటన.. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు

త్రిపురారం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ త్రిపురారం మండలం లోక్యతండలో పర్యటించారు. గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ తీరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామ పర్యటనలో భాగంగా కలెక్టర్ ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పింఛన్లు, తాగునీరు, ఇళ్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, విద్య తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం గ్రామంలో 43 పింఛన్లు ఉన్నాయని, మరో 13 పింఛన్లు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

గ్రామంలో సుమారు 40 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేవని గ్రామస్థులు కలెక్టర్‌కు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన గ్రామంలోని నీటి సరఫరా లైన్‌ను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గుడిసెలో నివసిస్తున్న ధనావత్ కృష్ణకుమారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్, ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించే గృహ నిర్మాణ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

గ్రామంలో రెండు డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. పనులను వెంటనే ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలోని పాఠశాలకు కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్ నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులకు సోమవారం నుంచి యూనిఫారాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

గ్రామంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించాలని రైతులకు సూచించారు.

పరిశుభ్రతపై కూడా కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. గ్రామ పారిశుద్ధ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

“అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి” అని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పేర్కొన్నారు.

కార్యాలయాలకు పరిమితం కాకుండా కలెక్టర్ స్వయంగా గ్రామంలో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోవడంపై లోక్యతండ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.

Sthanikam

ప్రజల ముంగిటకే పాలన.. ప్రతి ఇంటి సమస్యను తెలుసుకున్న కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News