తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని రావులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్ తెలిపారు. గ్రామపంచాయతీ నిధులతో బొడ్రాయి నుంచి సామకుంట వరకు చేపట్టనున్న మురికి కాలువ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు మురికి కాలువ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువ నిర్మాణం పూర్తయితే మురుగునీరు సక్రమంగా వెళ్లడంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు.గ్రామపంచాయతీ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఉప సర్పంచ్ అజీత్ ప్రసాద్, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు పత్తి శోభ, చిలుకూరి సునీత, చింతకుంట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధి తన ద్వేయంసర్పంచ్ చింతకుంట్ల మనోజ్

Bandi Kiran Kumar

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి