సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ కేంద్రంలో గురువారం తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి నాగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా ఎం. రాజేందర్, జనరల్ సెక్రెటరీగా సి.ఎస్. శ్రీనివాస్, ఆందోల్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఎం.ఎస్. రాజు, కోశాధికారిగా కే. శ్రీనివాస్‌ను నియమించారు. నూతన పదాధికారులకు జహీరాబాద్ పట్టణ సీఐ ఆర్. రవి నియామక పత్రాలు అందజేసి అభినందించారు.జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేసి, వారి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని నాయకులు సూచించారు. నూతన పదాధికారులు తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం కోసం నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
జహీరాబాద్ డివిజన్‌లో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) నూతన కమిటీ

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి