Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:58 PM

ప్రజల కోసం కళను అంకితం చేసిన అంజన్న.

ప్రజల కోసం కళను అంకితం చేసిన అంజన్న.

ప్రజల కోసం కళను అంకితం చేసిన అంజన్న.
20-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా సమస్యలే ఇతివృత్తంగా.. కళనే ఆయుధంగా మలచుకుని ప్రజలను చైతన్యపరిచిన ప్రజా కళాకారుడు కామ్రేడ్‌ కారుపోతుల అంజన్న సేవలు చిరస్మరణీయమని ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యుడు గంటెపాక శ్రీకృష్ణ, మండల అధ్యక్షుడు బర్రె మధు అన్నారు. అంజన్న 31వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం కక్కిరేణి గ్రామంలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోని అన్యాయాలు, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా తన కళారూపాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన అంజన్న.. ‘కళ కళ కోసం కాదు.. కళ ప్రజల కోసం’ అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రజల సమస్యలను తన కళ ద్వారా ప్రతిబింబిస్తూ సమాజ మార్పు కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి నేటి ప్రజా కళాకారులకు ఆదర్శమని పేర్కొన్నారు.

ప్రస్తుత కళాకారులు సైతం ప్రజా సమస్యలను తమ కళారూపాల్లో ప్రతిబింబిస్తూ సమాజ చైతన్యానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యుడు మజ్జూరి సాయి, మండల కమిటీ సభ్యులు కానుకుంట్ల ఉప్పలయ్య, మచ్చగిరి, వెంకన్న, లింగస్వామి, చరణ్, లోకేష్, బూడిద ఆది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల కోసం కళను అంకితం చేసిన అంజన్న.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News