Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు
19-08-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ గర్భిణీ స్త్రీల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్, వైద్యుల సలహాల కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీల వద్దకు వెళ్లి వారికి ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కూర్చోవడానికి సరైన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గర్భిణీలు తెలపడంతో డాక్టర్ రమేష్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రికి వచ్చే గర్భిణీలతో పాటు ప్రతి రోగి పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాలని, అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్, వైద్యుల సలహాలను సకాలంలో అందించాలని సూచించారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్‌కు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి రోగి సమస్యను సానుకూలంగా విని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా వైద్య సేవలను మెరుగుపరుస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు.

Sthanikam

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News