Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు

19-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

డబ్బులు ఇవ్వలేదని దారుణం.. 27 కత్తిపోట్లు.

ఇద్దరూ పదో తరగతి విద్యార్థులే.. ఒకరు పోలీసుల అదుపులో, మరొకరు పరారీ.

నల్గొండ: కొండమల్లేపల్లి మండలం జేబీనగర్‌లో స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె వద్ద డబ్బులు అడిగి ఇవ్వకపోవడంతో, అదే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

డబ్బుల కోసం ఇంట్లోకి చొరబడిన ఇద్దరు బాలురు.. రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా 27 కత్తిపోట్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇద్దరు బాలుర ప్రమేయాన్ని గుర్తించారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరో బాలుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.

Sthanikam

కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News