Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

18-08-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​అంకిరెడ్డిగూడెంలో అవగాహన సదస్సు

మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చౌటుప్పల్ పోలీస్ అధికారులు సూచించారు. అంకిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ డి. నర్సిరెడ్డి పాల్గొని స్థానిక యువత, గ్రామస్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ... మత్తు పదార్థాలకు బానిసలైతే వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని, సమాజంలో గౌరవం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నవతరం చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, విద్య, ఉద్యోగం, క్రీడారంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని కోరారు.

Sthanikam

డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News