Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:00 PM

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి.. లేకుంటే 23 నుంచి నిరవధిక సమ్మె

18-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆటో మోటార్స్ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కలగొని యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పలు హామీలు ఇచ్చిందని, వాటిలో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని, నష్టపోయిన వారికి నెలకు రూ.15 వేల నష్టపరిహార భృతి అందించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘ఫస్ట్ మైల్–లాస్ట్ మైల్’ పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ర్యాపిడో, ఓలా, ఉబెర్ వంటి కార్పొరేట్ సంస్థల దోపిడీని అరికట్టి, పాత ఛార్జీలను సవరించి కొత్త రేట్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓన్ బైక్ ట్యాక్సీ రైడ్లను నిషేధించాలని కోరారు.

అలాగే సీబీజీ గ్యాస్ వినియోగంతో ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, డీసీఎం వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు ఇంజిన్లపై భారం పెరిగి తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని యాదయ్య గౌడ్ పేర్కొన్నారు. సీబీజీకి బదులుగా తిరిగి సీఎన్‌జీ గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీఎన్‌జీ అందించలేని పక్షంలో సీఎన్‌జీ వాహనాల పర్మిట్లను బేషరతుగా వెనక్కి తీసుకుని, డీజిల్ వాహనాలను ఉచితంగా అందించాలని కోరారు.

23 నుంచి సమ్మె: ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలంగాణ ఆటో మోటార్స్ జేఏసీ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌టీయూ టీయూటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజరల్లి మీర్జా, జిల్లా ఉపాధ్యక్షులు ఈదుల వెంకన్న, గొలుసు శంకర్‌బాబా, డీవీకే రోడ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు భాషాపాక యాదయ్య, పట్టణ అధ్యక్షుడు డి.వెంకటేష్, చర్లపల్లి అధ్యక్షుడు యాదయ్య, శంకర్, కేశవులు, ముంత ఎంకన్న, వజ్రయ్య, మోదుగుల రాంబాబు, నరేందర్, పాలకూరి నాగరాజు, విద్య, రామమూర్తి, బొంగరాల నాగయ్య, బాలస్వామి, రామినేని రహీం బాబా, వెంకన్న, పాలకూరి నాని, సుధాకర్‌రెడ్డి, పాలకూరి శీను, టి.శీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి.. లేకుంటే 23 నుంచి నిరవధిక సమ్మె

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News