Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:27 AM

ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం అందించాలి బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్

17-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ మహిళలు భారీ నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుమేరకు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాల ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

*హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఎత్తివేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను నిలిపివేసే ప్రయత్నంలో భాగంగానే హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు వచ్చాయని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకుని నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేయించి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో పేద కుటుంబాలు, ముఖ్యంగా ఆడపిల్లల వివాహాల కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను గమనించిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించాలనే సంకల్పంతో ఈ పథకాలను అమలు చేశారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా అందించాలని డిమాండ్ చేశారు.

*మహిళలు తిరుగుబాటుకు సిద్ధం*

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేస్తే బీఆర్‌ఎస్ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతారని నాయకులు హెచ్చరించారు. పేద కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే పథకాలను కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మహిళా మండల పరిషత్ అధ్యక్షులు నెమరుగొమ్ముల స్నేహలత, గుండగాని కవిత, సర్పంచ్ మాతంగి వెంకటమ్మ, ఉపసర్పంచ్ సరిత, మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు కొమ్మినేని సతీష్, దూపటి రవి, మాజీ ఉప మండల పరిషత్ అధ్యక్షుడు శ్రీశైలం, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, తదితరులతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం అందించాలి బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News