Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:03 PM

రెండు నెలలుగా పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. పట్టించుకోని అధికారులు!

17-08-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలుషిత నీటితో నాగిరెడ్డిపల్లి ప్రజల అవస్థలు – అంటువ్యాధుల భయం.

నాగిరెడ్డిపల్లి, ఆగస్టు 17:

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి సుమారు రెండు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్ పగిలిన ప్రాంతం నుంచి బురద, మురుగునీరు కలిసే పరిస్థితి ఏర్పడి, అదే నీరు పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

కలుషిత నీటిని తాగడం, వినియోగించడం వల్ల గ్రామంలో అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమస్యను పలుమార్లు సంబంధిత మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని వాపోతున్నారు.

ఎవరి బాధ్యత?

సమస్యపై గ్రామ సెక్రటరీని సంప్రదించగా.. “ఇది మిషన్ భగీరథ పైప్‌లైన్.. దీనితో మాకు సంబంధం లేదు” అని చెబుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మరోవైపు మిషన్ భగీరథ అధికారులు మాత్రం గ్రామపంచాయతీ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.

అధికారుల మధ్య బాధ్యతల నెట్టివేతతో రెండు నెలలుగా గ్రామ ప్రజలు కలుషిత నీటితో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ సమస్యపై ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

ఎండీఓ, గ్రామ సెక్రటరీతో పాటు సంబంధిత మిషన్ భగీరథ అధికారులు వెంటనే నాగిరెడ్డిపల్లిలో పగిలిన పైప్‌లైన్‌ను పరిశీలించి, మరమ్మతులు చేపట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ప్రజల ఆరోగ్యానికి ఏదైనా ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరిది? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

Sthanikam

రెండు నెలలుగా పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. పట్టించుకోని అధికారులు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News