తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ఊర ముత్యాలమ్మ తల్లి ఆలయంలో బోనాల సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
25వ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ, 23వ వార్డు కౌన్సిలర్ వల్దాసు లక్ష్మీ శ్రీను (రెబల్) ఆహ్వానం మేరకు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ చింతమళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్‌రెడ్డి, గుణగంటి హేమ సతీష్, మన్నెం అరుణ మల్లేష్, కొనతం రాజేష్‌రెడ్డి, చెంచల మణిలత శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గుంటి భానురేఖ సైదులు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్‌రెడ్డి, జిల్లా సేవాదళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అన్నమయ్య రాము తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి