Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

ఉత్తమ 102 అంబులెన్స్ పైలట్‌గా పావిరాల నాగరాజుకు అవార్డు

16-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన పావిరాల నాగరాజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ 102 అంబులెన్స్ పైలట్‌గా అవార్డు అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష యాదవ్ చేతుల మీదుగా నాగరాజు ఈ అవార్డును అందుకున్నారు.

102 అంబులెన్స్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు.. ఎప్పుడు ఫోన్ వచ్చినా వెంటనే స్పందిస్తూ, నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో సేవలందిస్తున్నారు. రామన్నపేట ఏరియా పరిధితో పాటు మునిపంపుల, వలిగొండ, వేములకొండ తదితర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి గర్భిణులు, అత్యవసర రోగులను సురక్షితంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను క్షేమంగా ఇళ్లకు చేర్చడంలోనూ సేవలు అందిస్తున్నారు.

తన విధి నిర్వహణలో అంకితభావం, సమయస్ఫూర్తి, సేవా దృక్పథాన్ని గుర్తించిన అధికారులు ఉత్తమ 102 అంబులెన్స్ పైలట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు అందుకోవడంతో నాగరాజును తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.

Sthanikam

ఉత్తమ 102 అంబులెన్స్ పైలట్‌గా పావిరాల నాగరాజుకు అవార్డు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News