Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:05 PM

అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు

16-08-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కత్తెరతో దాడి.. వెంకటేశ్‌ (28) మృతి | పరారీలో శివ.. పోలీసుల గాలింపు

చైతన్యపురి: తండ్రి అంత్యక్రియల ఖర్చుల విషయంలో మొదలైన అన్నదమ్ముల మధ్య వివాదం చివరకు హత్యకు దారితీసింది. డబ్బుల విషయమై జరిగిన గొడవలో తమ్ముడు కత్తెరతో అన్నపై దాడి చేయడంతో వెంకటేశ్‌ (28) అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చంపాపేట కుమ్మరిబస్తీలో శనివారం చోటుచేసుకుంది.

తండ్రి అంత్యక్రియల ఖర్చుల్లో తన వాటా ఇవ్వలేదంటూ వెంకటేశ్‌ తమ్ముడు శివ (26) కొంతకాలంగా అన్నతో గొడవపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో శివ కత్తెరతో వెంకటేశ్‌పై దాడి చేసినట్లు సమాచారం.

తీవ్ర గాయాలతో వెంకటేశ్‌ మృతి చెందాడు. ఘటన అనంతరం శివ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News