Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

ఎల్‌ఐసీ-2 ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

15-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)-2 ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఆర్‌. లక్ష్మా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పౌరుడు క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ దేశ ప్రగతికి తోడ్పడాలని సూచించారు.

దేశాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఎల్‌ఐసీ ఆర్థిక చేయూత అందిస్తూ తనవంతు పాత్ర పోషిస్తోందన్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన సమయంలో బీమా పాలసీల ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, ఏజెంట్‌ మిత్రులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

ఎల్‌ఐసీలో చోటుచేసుకుంటున్న డిజిటల్‌ మార్పులకు అనుగుణంగా పాలసీదారులకు అవగాహన కల్పించాలని ఏజెంట్లను కోరారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడినప్పుడే దేశం బలపడుతుందని, ప్రతి పౌరుడు కనీసం ఒక జీవిత బీమా పాలసీ తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

కార్యక్రమంలో ఎల్‌ఐసీ ఏజెంట్లు, కార్యవర్గ సిబ్బంది, ఉద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఎల్‌ఐసీ-2 ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News