Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

ట్రాన్స్‌ఫార్మర్స్‌ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

15-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డు వైపు ఉన్న అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీరింగ్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ కట్కూరి శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను స్మరించుకోవాల్సిన రోజు ఇదని పేర్కొన్నారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు ఐక్యంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించారని తెలిపారు.

తెలుగువారి పోరాటం స్ఫూర్తిదాయకం.

స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగు ప్రాంతానికి చెందిన పలువురు మహనీయులు కీలక పాత్ర పోషించారని, వారి పోరాటం, త్యాగాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం కొనసాగించాలని సూచించారు.

కార్యక్రమంలో డీఈ ప్రభాకర్‌, ఏడీఈ సతీష్‌, ఏఈ శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్‌కుమార్‌, కార్యవర్గ సిబ్బంది రాజు, సమ్మిరెడ్డి, భీమా, అర్జున్‌రెడ్డి, రమేష్‌కుమార్‌, పాండు, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రాన్స్‌ఫార్మర్స్‌ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News