Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:58 PM

31న ఇంద్రాపార్క్‌ వద్ద మహాధర్నాకు తరలిరండి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జహంగీర్‌

15-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

మూసీ ప్రక్షాళనపై డీపీఆర్‌ ప్రకటించాలి

గోదావరి జలాలను మూసీ కాలువలు, చెరువులకు అనుసంధానం చేయాలి.

పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తక్షణమే డీపీఆర్‌ ప్రకటించి, కలుషిత జలాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పోచంపల్లిలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

మూసీ జలాల కలుషితంతో పోచంపల్లి ప్రాంత రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నీటితో సాగవుతున్న పంటలు, కూరగాయలు, పండ్ల తోటలు, చేపల్లో విషపదార్థాల అవశేషాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారని, వీటిని వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.

గోదావరి జలాలతో మూసీకి పునర్జీవం.

ప్రజలు, పంటలను కాపాడేందుకు మూసీ ప్రక్షాళన చేపట్టడంతో పాటు గోదావరి జలాలను మూసీ పరిధిలోని కాలువలు, చెరువులకు అనుసంధానం చేయాలని జహంగీర్‌ సూచించారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను షామీర్‌పేట చెరువుకు తరలించి, అక్కడి నుంచి ఏదులాబాద్‌ చెరువును నింపేలా చర్యలు చేపట్టాలని కోరారు.

జిల్లాలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బస్వాపురం, గంధమల్ల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న పిల్లాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాలువలకు నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని, ఆసిఫ్‌నగర్‌, బృందావనం కాలువలను పునరుద్ధరించాలని కోరారు.

మహాధర్నాకు తరలిరావాలి.

సాగునీటి ప్రాజెక్టులు, కాలువల పూర్తి, మూసీ ప్రక్షాళన, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి నుంచి హైదరాబాద్‌ ఇంద్రాపార్క్‌ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 31న ఇంద్రాపార్క్‌ వద్ద నిర్వహించే మహాధర్నాకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని జహంగీర్‌ పిలుపునిచ్చారు.

సమావేశానికి సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు పగిళ్ల లింగారెడ్డి అధ్యక్షత వహించగా, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు, ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి, మండల కమిటీ సభ్యులు నెల్లికంటి జంగయ్య, సామ జంగారెడ్డి, పత్తి బిక్షపతి, బోయపల్లి పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

31న ఇంద్రాపార్క్‌ వద్ద మహాధర్నాకు తరలిరండి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జహంగీర్‌

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News