బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సీయోను ప్రార్థనా మందిరం వద్ద నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవ. జీవ ప్రకాశం బల్లెం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ప్రజలంతా ఐకమత్యంతో ఒక కుటుంబంలా జీవిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రముఖుల పాల్గొనడం కార్యక్రమంలో రెవ. బ్లెస్సి జీవ ప్రకాశం బల్లెం, గ్రామ సర్పంచ్ దిగోజు లతా వెంకటాచారి, ఉపసర్పంచ్ ఓర్సు మంజుల శ్రీను, వార్డు సభ్యుడు జిల్లా నాగయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్ కల్కూరి సూర్యకళ, సంఘ పెద్దలు కొమ్ము అబ్రహం, చింతమల్ల ఆమోస్, కొమ్ము వెంకటయ్య, జస్లీనా బల్లెం, జాయిస్ బల్లెం, బ్లెస్సింగ్ పాల్ బల్లెం, వెలిజాల అభిలాష్, జిల్లా చందు, వెలిజాల అఖిల్‌కుమార్, కొమ్ము సౌజన్య, కొమ్ము విజయ, జిల్లా శోభ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, విశ్వాసులు, సంఘస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి