Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

పూర్వ విద్యార్థుల సేవాభావం.. పాఠశాలకు రూ.50 వేల స్టేజీ విరాళం

15-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, ఆగస్టు 15:

చదువుకున్న పాఠశాలను మరువకుండా పూర్వ విద్యార్థులు సేవాభావాన్ని చాటుకున్నారు. చిట్యాల మండలం తాళ్లవెల్లంల MPUPS పాఠశాలలో 1994–95 నుంచి 1999–2000 విద్యా సంవత్సరాల మధ్య ఒకటి నుంచి ఆరో తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ నలుగురు మిత్రుల జ్ఞాపకార్థం సుమారు రూ.50 వేల విలువైన స్టేజీని నిర్మించి పాఠశాలకు విరాళంగా అందజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ఈ స్టేజీని ప్రారంభించారు.

అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బహుమతుల కోసం మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్ రూ.5 వేల, మాజీ ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మీపతి రూ.3 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులతో పాటు, బహుమతులకు ఆర్థిక సహాయం అందించిన దాతలను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. విద్యార్థుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పలువురు కొనియాడారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్, ఉపసర్పంచ్ సునీత బుచ్చిరాములు, ప్రధానోపాధ్యాయులు ఏలుకరాజు ఆంజనేయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నక్కా స్వప్న చంద్రశేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, కిరణ్ కుమార్, కాటమయ్య, లింగారెడ్డి, మౌనిక, శివాని, గ్రామ పెద్దలు, ప్రజలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పూర్వ విద్యార్థుల సేవాభావం.. పాఠశాలకు రూ.50 వేల స్టేజీ విరాళం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News