టీటీడీ భూమిపై కబ్జా యత్నం.. చిట్యాలలో బీఆర్ఎస్ ఆందోళన పత్రాలు చూపిస్తూ ఆరోపణలు..
టీటీడీ భూమిపై కబ్జా యత్నం.. చిట్యాలలో బీఆర్ఎస్ ఆందోళన పత్రాలు చూపిస్తూ ఆరోపణలు..
Komidala Mahender reddy
కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
చిట్యాల పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం కోసం గతంలో కొనుగోలు చేసి అప్పగించిన భూమిని కబ్జా చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. భూమిని పరిశీలించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు బొబ్బలి శివశంకర్ రెడ్డి సంబంధిత పత్రాలను ప్రదర్శిస్తూ తమ వాదనను వివరించారు.
ఆయన మాట్లాడుతూ.. చిట్యాలలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం 649 సర్వే నెంబర్ లో గల భూమి నీ స్థానిక పెద్దలు గుత్త సుఖేందర్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ప్రజల నుంచి చందాలు సేకరించి రూ.2.56 లక్షలతో 1 ఎకరం 12 గుంటల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ఆ భూమికి సంబంధించిన హద్దులు అగ్రిమెంట్‌లో స్పష్టంగా నమోదు అయ్యాయని, టీటీడీకి స్థలం కేటాయించాలని కోరుతూ అప్పట్లో అధికారులకు వినతిపత్రం అందించగా తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే కూడా నిర్వహించినట్లు చెప్పారు.
అయితే ప్రస్తుతం ఆ భూమిపై కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ భర్త పందిరి రమేష్ భూమిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యజమానులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో చేసిన ఖర్చులను రాబట్టుకునేందుకే చిట్యాల మున్సిపల్ చైర్మన్ భర్త పందిరి రమేష్ పాత్ర ఉందంటూ ఆరోపిస్తూ, ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు.
టీటీడీ కోసం కొనుగోలు చేసిన భూమిని అగ్రిమెంట్ ప్రకారమే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ప్రజల ప్రయోజనాల కోసం కళ్యాణ మండపం లేదా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూమిపై ఎలాంటి కబ్జా ప్రయత్నాలు జరిగినా చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి