సేవకు సరిహద్దులు లేవు..!రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న వేముల సైదులు–నీలం శేఖర్.
సేవకు సరిహద్దులు లేవు..!రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న వేముల సైదులు–నీలం శేఖర్.
Editor Desk
చిన్నారులకు రూ.1.88 లక్షల డిపాజిట్..
వికలాంగుడికి ఎలక్ట్రిక్ వీల్‌చైర్.. పేదలకు ఉపాధి కల్పన.
రామన్నపేట, ఆగస్టు 4, సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ విద్య, వైద్యం, జీవనోపాధి రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రామన్నపేట మండలానికి చెందిన సామాజిక కార్యకర్త వేముల సైదులు, ఎన్నారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నీలం శేఖర్ తెలిపారు. మిత్రులు, దాతల సహకారంతో మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తొండ తిరుమలగిరి మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన స్వాతి అకాల మరణంతో ఆమె ఇద్దరు కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి పేర్లపై మొత్తం రూ.1.88 లక్షలు డిపాజిట్ చేయించినట్లు తెలిపారు. అక్షర చైతన్య వారధుల ద్వారా రూ.1 లక్ష, కుటుంబ సభ్యుల నుంచి రూ.65 వేలు, క్లాస్‌మేట్స్ సహకారంతో రూ.23 వేలు సమకూర్చినట్లు వివరించారు. తల్లి లేని లోటును తీర్చలేకపోయినా చిన్నారుల చదువు, భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు చెప్పారు.
అలాగే సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం మంగళకుంట తండాకు చెందిన ఎం.ఏ., బి.ఎడ్. పట్టభద్రుడు రవి నాయక్ నరాల బలహీనతతో కదలలేని పరిస్థితిలో ఉండటాన్ని గుర్తించి ఆయనకు రూ.90 వేల విలువైన ఎలక్ట్రిక్ వీల్‌చైర్ అందజేసినట్లు తెలిపారు. దీనివల్ల ఆయన స్వయం ప్రతిపత్తితో జీవించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి పేద, ప్రతిభావంతులైన విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే విద్యార్థులకు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఆపద్బాంధవులు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమైన కుటుంబాలకు ప్రతి నెల 25 నుంచి 50 కిలోల బియ్యంతో పాటు 16 రకాల నిత్యావసర వస్తువులు అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అవసరమైన కుటుంబాలకు కుట్టు మిషన్లు, కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
కేవలం తక్షణ సాయం అందించడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో కుటుంబాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో నిలదొక్కుకునేలా చేయడమే తమ సేవా కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని వేముల సైదులు, నీలం శేఖర్ తెలిపారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలు, ఉపాధ్యాయులు, మిత్రులు, సేవా సంస్థల సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. "సేవ మన బాధ్యత.. మానవత్వం మన బలం.. మన చేతులు కలిస్తే మరో కుటుంబం జీవితంలో వెలుగు నింపవచ్చు" అని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి