Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

న్యాయవాది హత్యపై నల్లకోట్ల ఆగ్రహం. రామన్నపేట కోర్టులో విధుల బహిష్కరణ..

04-08-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కోర్టు పరిధికి చెందిన న్యాయవాది మల్లయ్య దారుణ హత్యను ఖండిస్తూ రామన్నపేట కోర్టు న్యాయవాదులు మంగళవారం విధులను పూర్తిగా బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. నల్లకోట్లతో కోర్టు ఆవరణలో ఆందోళన చేపట్టి, హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. మజీద్ మాట్లాడుతూ.. సభ్య సమాజంలో హత్యలతో సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. న్యాయవాదిపై జరిగిన దారుణ దాడి న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష విధించాలని కోరారు.

ఐఎల్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామీడి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. "న్యాయవాది మల్లయ్య హత్య అంటే న్యాయవ్యవస్థపైనే దాడి చేసినట్లే" అని వ్యాఖ్యానించారు. సమాజంలో పెరుగుతున్న దాడులు, హత్యల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మల్లయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి యాదాసు యాదయ్య, ఉయ్యాల హనుమంతు గౌడ్, బాతరాజు అశోక్ కుమార్, అమానుల్లా ఖాన్, నోముల స్వామి, గడ్డం నరసింహ, సతీష్ రెడ్డి, అజీజుద్దీన్, సురేష్, మల్లేష్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాయవాది హత్యపై నల్లకోట్ల ఆగ్రహం. రామన్నపేట కోర్టులో విధుల బహిష్కరణ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News