Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:11 PM

పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. భీమ్రా గ్రామసభలో వ్యవసాయ అధికారుల సూచనలు

03-08-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో వ్యవసాయ విస్తరణాధికారి సంతోష్ పత్తి రైతులకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యవసాయ శాఖ సూచించే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే పత్తి పంటను సురక్షితంగా కాపాడుకోవచ్చని తెలిపారు. వర్షపు నీరు పొలాల్లో ఎక్కువసేపు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పొలాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, పంటను తరచూ పరిశీలించాలని సూచించారు. వేరుకుళ్ల నివారణ కోసం వ్యవసాయ శాఖ సూచించిన మోతాదులో కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును నీటిలో కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలని, మందులను అధికారుల సూచనల మేరకే వినియోగించాలని రైతులకు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడకుండా వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ పంటను రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడిమిదొడ్డి బాబు, పంచాయతీ కార్యదర్శి తస్లీమ్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. భీమ్రా గ్రామసభలో వ్యవసాయ అధికారుల సూచనలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో వ్యవసాయ విస్తరణాధికారి సంతోష్ పత్తి రైతులకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యవసాయ శాఖ సూచించే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే పత్తి పంటను సురక్షితంగా కాపాడుకోవచ్చని తెలిపారు. వర్షపు నీరు పొలాల్లో ఎక్కువసేపు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పొలాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, పంటను తరచూ పరిశీలించాలని సూచించారు. వేరుకుళ్ల నివారణ కోసం వ్యవసాయ శాఖ సూచించిన మోతాదులో కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును నీటిలో కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలని, మందులను అధికారుల సూచనల మేరకే వినియోగించాలని రైతులకు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడకుండా వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ పంటను రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడిమిదొడ్డి బాబు, పంచాయతీ కార్యదర్శి తస్లీమ్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News