Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:30 PM

స్వామీ.. మా సీఎం కు జెర చెప్పరూ!

స్వామీ.. మా సీఎం కు జెర చెప్పరూ!

స్వామీ.. మా సీఎం కు జెర చెప్పరూ!
20-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని గణేశుడికి భక్తుల వినూత్న వినతి.

నార్కట్‌పల్లి: రోడ్డు నిర్మాణ పనులు తరచూ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇకనైనా పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని కోరుతూ భక్తులు వినాయకుడికి వినూత్నంగా వినతిపత్రం సమర్పించారు

. నార్కట్‌పల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద భక్తులు ఈ మేరకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, తమ సమస్యను గణేశుడి దృష్టికి తీసుకెళ్లారు.

‘‘విఘ్నాలను తొలగించే దేవుడివి గణేశా.. మా ఊరిలో రోడ్డు పనులు తరచూ ఆగిపోతున్నాయి. రహదారి అధ్వానంగా ఉండటంతో ఇప్పటికే పలువురు గాయాలపాలయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమాచారం అందించాలి’’ అంటూ భక్తులు గణేశుడిని వేడుకున్నారు.

ముఖ్యమంత్రి దృష్టికి రోడ్డు సమస్యను తీసుకెళ్లి, నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా విఘ్నాలు తొలగించాలని కోరుతూ వినాయకుడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తామని భక్తులు తెలిపారు.

Sthanikam

స్వామీ.. మా సీఎం కు జెర చెప్పరూ!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News