Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్! అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 08:15 PM

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్!

20-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో భారీ ప్రాజెక్ట్‌.. ఏషియన్‌ సినిమాస్‌తో మెగాస్టార్‌ చిరంజీవి భాగస్వామ్యం

సినీ రంగంలో హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఏషియన్‌ సినిమాస్‌, మెగాస్టార్‌ చిరంజీవి భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న ఈ భారీ తెర ప్రస్తుత ప్రపంచ రికార్డును అధిగమించేలా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జర్మనీలోని లియోన్‌బర్గ్‌లో ఉన్న ట్రామ్‌పలాస్ట్‌ థియేటర్‌ స్క్రీన్‌ 38.8 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత సినిమా స్క్రీన్‌గా గిన్నిస్‌ రికార్డుల్లో ఉంది. హైదరాబాద్‌లో ప్రతిపాదిత స్క్రీన్‌ ఈ రికార్డును అధిగమించే స్థాయిలో రూపొందించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ అత్యాధునిక సినిమా అనుభవాలకు కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ నగర సినీ ఖ్యాతిని మరింత పెంచే అవకాశం ఉంది.

ఏషియన్‌ సినిమాస్‌తో చిరంజీవి భాగస్వామ్యంతో రానున్న ఈ ప్రీమియం సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, స్క్రీన్‌ కొలతలు, ప్రారంభ తేదీ తదితర అంశాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Sthanikam

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News