మృతుడు ఖమ్మం మమతా హాస్పిటల్ న్యూరో సర్జన్ కాసకుర్తి జగదీష్‌గా గుర్తింపు.
సూర్యాపేట: ఖమ్మం–హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
మృతుడు ఖమ్మంలోని మమతా హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్‌గా నిర్ధారించారు.
డివైడర్‌ను ఢీకొన్న అనంతరం కారులో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ఉన్న జగదీష్ మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, కారులో మరెవరైనా ఉన్నారా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి