Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 09:34 PM

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: మంత్రి ఉత్తమ్‌

19-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

తెలంగాణలో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కోదాడలో శనివారం నిర్వహించిన భారీ మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేయగానే సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు లభించిన భారీ ఆధిక్యమే ఈ ప్రాంతంలో పార్టీకి ఉన్న ప్రజాబలానికి నిదర్శనమని ఉత్తమ్‌ పేర్కొన్నారు. లక్షకు పైగా మెజారిటీ సాధించడంలో ఈ రెండు నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని స్పష్టం చేశారు.అనంతరం మెగా జాబ్‌మేళా ప్రాముఖ్యతను వివరిస్తూ, గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలను నేరుగా అందుబాటులోకి తీసుకురావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.

Sthanikam

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: మంత్రి ఉత్తమ్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News