నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.శనివారం కోదాడలో నిర్వహించిన జాబ్మేళాలో పాల్గొని మాట్లాడారు.యువత నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. యువత నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.అనంతరం మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.జాబ్‌మేళాలో పాల్గొన్న 350కి పైగా కంపెనీలు దాదాపు 5,725 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేయడం గొప్ప విజయమని శ్రీధర్‌బాబు అభినందించారు. ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి వారం రోజులుగా నిరంతరం శ్రమించిన అధికారులు, కంపెనీల ప్రతినిధులు, సుమారు 700 మంది వాలంటీర్ల సేవలను ప్రశంసించారు.
ప్రభుత్వం ఒక్కటే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, ప్రైవేటు రంగం కూడా ముందుకొచ్చి ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషించాలని కోరారు. డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, డిప్లొమా, ఐటీఐ, ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన యువతకు పరిశ్రమలు విస్తృత అవకాశాలు కల్పించాలన్నారు.వందలాది కంపెనీలను గ్రామీణ యువత వద్దకు తీసుకొచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిని శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొనేలా ఉత్తమ్ వ్యక్తిగతంగా పలుమార్లు సంప్రదింపులు జరిపారని చెప్పారు.ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి విజ్ఞప్తి మేరకు కోదాడలో వీలైనంత త్వరగా ‘టాస్క్’ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేంద్రం స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించే ప్రధాన వేదికగా మారడంతోపాటు వారిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి