Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 06:28 PM

వెంటనే స్పందించి.. తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

11-09-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ ఎస్సీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీవాసులు తమ సమస్యను గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే సూచనలతో సర్పంచ్ పంచగామ బీరప్ప స్వయంగా దగ్గరుండి బోర్ మోటార్‌ను బిగించి ప్రారంభించారు.దీంతో ఎస్సీ కాలనీ ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారమై నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సమస్యను వెంటనే పరిష్కరించిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, సర్పంచ్ పంచగామ బీరప్పకు కాలనీవాసులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెంటనే స్పందించి.. తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News