Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంటనే స్పందించి.. తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 05:28 PM

“అక్రమ షెడ్లపై టౌన్‌ ప్లానింగ్‌ కొరడా.. హయత్‌నగర్‌లో సీజ్‌!”

11-09-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్‌ 10 (స్థానికం ప్రతినిధి):

అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఎల్‌బీనగర్‌ జోన్‌ పరిధిలోని హయత్‌నగర్‌లో విజయవాడ జాతీయ రహదారికి సమీపంలోని హయత్‌నగర్‌–తొర్రూర్‌ రోడ్డులో సాయిబాబా ఆలయం వెనుక భాగంలో ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ విషయం టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల దృష్టికి రావడంతో హయత్‌నగర్‌ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో టీపీఎస్‌ సోమేష్‌ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. నిర్మాణాన్ని పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి అక్రమ షెడ్డును సీజ్‌ చేశారు.

అదేవిధంగా వనస్థలిపురంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మరో షెడ్డును కూడా అధికారులు సీజ్‌ చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంవల్ల నిబంధనల ఉల్లంఘనతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన నిర్మాణ అనుమతి ఫీజులు, ఇతర రుసుములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. అనధికార నిర్మాణాలు పెరిగితే భవిష్యత్‌లో ట్రాఫిక్‌, పార్కింగ్‌, డ్రైనేజీ, రహదారి విస్తరణ వంటి సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందన్నారు.

అక్రమార్కులను ఉపేక్షించం

ఏసీపీ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే సీజ్‌ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హయత్‌నగర్‌ పరిధిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Sthanikam

“అక్రమ షెడ్లపై టౌన్‌ ప్లానింగ్‌ కొరడా.. హయత్‌నగర్‌లో సీజ్‌!”

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News