ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహారెడ్డి
చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు కావడం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతర కృషి ఫలితమేనని చౌటుప్పల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తాను బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ మాధవి దేవికి నూతన భవన నిర్మాణంపై వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అప్పటి జడ్జి మారుతి దేవి కోర్టును, దానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రస్తుత జిల్లా జడ్జి జయరాజ్ కూడా స్థలాన్ని సందర్శించి నూతన భవన నిర్మాణ ప్రతిపాదనలను హైకోర్టుకు పంపినట్లు వివరించారు. న్యాయవాదుల సమస్యను గ్రహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి, భవన మంజూరుకు తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా సర్వే నంబరు 50లోని 5 ఎకరాల స్థలంలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసిందన్నారు. కోర్టు భవన నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు న్యాయవాదుల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి