Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్ మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 08:44 PM

ధోలేరా స్మార్ట్ సిటీ.. లోథల్ వైభవం గుజరాత్‌లో తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం పర్యటన.

10-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో గుజరాత్‌లో పర్యటిస్తున్న తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం బుధవారం ధోలేరా గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ, చారిత్రక లోథల్‌ పురావస్తు ప్రదేశాలను సందర్శించింది.

ధోలేరాలో స్మార్ట్‌ సిటీ సమగ్ర మాస్టర్‌ ప్లాన్, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, ప్లగ్‌అండ్‌ ప్లే పారిశ్రామిక వ్యవస్థ, లాజిస్టిక్స్‌ కనెక్టివిటీ, భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికలపై అధికారులు మీడియా బృందానికి వివరించారు. ధోలేరా ఇండస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ (డీఐసీడీఎల్‌) జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రుషిన్‌ భట్, మార్కెటింగ్‌ మేనేజర్‌ అదితి గోయక్‌ ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ యుటిలిటీస్, పెట్టుబడి అవకాశాలపై వివరించారు.

4,500 ఏళ్ల నాటి లోథల్‌ సందర్శన

అనంతరం మీడియా ప్రతినిధులు సుమారు 4,500 ఏళ్ల నాటి సింధు లోయ నాగరికతకు చెందిన లోథల్‌ పురావస్తు ప్రదేశాన్ని సందర్శించారు. పురాతన డాక్‌యార్డ్, గిడ్డంగులు, పట్టణ మురుగునీటి పారుదల వ్యవస్థలను పరిశీలించారు. అప్పటి ప్రజల పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ నైపుణ్యం, సముద్ర వాణిజ్య విధానాలపై అవగాహన పొందారు.

రూ.4,500 కోట్లతో మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌

లోథల్‌లో అభివృద్ధి చేస్తున్న నేషనల్‌ మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎంహెచ్‌సీ) పనులను కూడా బృందం పరిశీలించింది. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వ శాఖ సాగర్‌మాల కార్యక్రమంలో భాగంగా సుమారు 400 ఎకరాల్లో రూ.4,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది.

ఈ కాంప్లెక్స్‌లో భారతదేశ 4,500 ఏళ్ల సముద్ర వారసత్వాన్ని చాటిచెప్పే మారిటైమ్‌ గ్యాలరీలు, పురాతన లోథల్‌ నమూనా, లైట్‌హౌస్‌ మ్యూజియం, 5డీ డోమ్‌ థియేటర్, ఆక్వాటిక్‌ గ్యాలరీతో పాటు తీర రాష్ట్రాల పావిలియన్లు, థీమ్‌ పార్కులు, పర్యావరణహిత రవాణా, సందర్శకుల వసతి వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

అభివృద్ధి–వారసత్వ పరిరక్షణకు సమన్వయం.

ధోలేరా ఆధునిక పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుండగా.. లోథల్‌ భారతదేశ ప్రాచీన నాగరికత, సముద్ర వారసత్వానికి అద్దం పడుతోందని అధికారులు తెలిపారు. ‘వికాస్‌ భీ.. విరాసత్‌ భీ’ లక్ష్యానికి అనుగుణంగా దేశ అభివృద్ధి, చారిత్రక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న తీరును ఈ పర్యటన ద్వారా మీడియా ప్రతినిధులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

Sthanikam

ధోలేరా స్మార్ట్ సిటీ.. లోథల్ వైభవం గుజరాత్‌లో తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం పర్యటన.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News