భూదానం అభినందనీయం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
పవిత్ర కార్యాలకు, ప్రజా అవసరాలకు స్థలాలను విరాళంగా అందించడం ఎంతో అభినందనీయమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. స్థానిక కంచరకుంట్ల కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆమె బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మండప నిర్మాణం కోసం 15 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయించిన కంచరకుంట్ల సత్తిరెడ్డి - జానకమ్మ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను చెత్త సేకరణ వాహనాల్లోనే వేయాలని కాలనీవాసులకు సూచించారు.
ఈ సందర్భంగా భూదాత కంచరకుంట్ల సత్తిరెడ్డి మాట్లాడుతూ.. కాలనీ అవసరాల కోసం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మరో 400 గజాల సొంత స్థలాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాలనీవాసులు ఒక సంఘంగా ఏర్పడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి సూచించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి కాలనీలో మొక్కలు నాటారు. స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవి మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామంటూ ఎస్ఐఆర్ (SIR) ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి, నాయకులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, బత్తుల విప్లవ్, ఎస్‌కే జానీబాబు, తాడూరి పరమేష్ తదితరులు పాల్గొన్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి