Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్ న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 05:00 PM

రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా రాజకీయ అండ ఉందని అతి చేస్తే తాటతీస్తా. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి.

09-09-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: జిల్లాలో శాంతిభద్రతలు సామరస్యంగా ఉన్నాయని, వాటికి విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి హెచ్చరించారు. రాజకీయ నాయకుల అండ ఉందనే ధీమాతో రౌడీషీటర్లు అతిగా ప్రవర్తిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. పట్టణంలోని సుమారు 80 నుంచి 100 మంది రౌడీషీటర్లను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో పాటు బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.

సంఘవిద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్‌తో పాటు జైలు శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ ఎం.రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, టూటౌన్‌ సీఐ ఆదిరెడ్డి, టూటౌన్‌ ఎస్‌ఐ సైదాబాబు, రూరల్‌ ఎస్‌ఐ శివతేజతో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా రాజకీయ అండ ఉందని అతి చేస్తే తాటతీస్తా. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి.

Article Image

నల్లగొండ: జిల్లాలో శాంతిభద్రతలు సామరస్యంగా ఉన్నాయని, వాటికి విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి హెచ్చరించారు. రాజకీయ నాయకుల అండ ఉందనే ధీమాతో రౌడీషీటర్లు అతిగా ప్రవర్తిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. పట్టణంలోని సుమారు 80 నుంచి 100 మంది రౌడీషీటర్లను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో పాటు బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.

సంఘవిద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్‌తో పాటు జైలు శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ ఎం.రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, టూటౌన్‌ సీఐ ఆదిరెడ్డి, టూటౌన్‌ ఎస్‌ఐ సైదాబాబు, రూరల్‌ ఎస్‌ఐ శివతేజతో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News