తిరుమలగిరి: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నాగారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. తిరుమలగిరిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో ఉత్సవ కమిటీలు, విగ్రహ తయారీదారులు, డీజే నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
డీజేల అధిక శబ్దం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే విధంగా సౌండ్ సిస్టమ్‌లను వినియోగించరాదని సూచించారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ నిర్దేశించిన శబ్ద పరిమితులు, సమయ నిబంధనలను ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉత్సవ కమిటీలు డీజే నిర్వాహకులకు నిబంధనలపై ముందుగానే అవగాహన కల్పించాలని, నిమజ్జన ఊరేగింపుల్లో కూడా శాంతిభద్రతలకు భంగం కలగకుండా వ్యవహరించాలని కోరారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ నాగేశ్వరరావు సూచించారు. గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి