తిరుమలగిరి; మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ అన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ కార్డు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు పాలించిన కూడా ఏ ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రెండు సంవత్సరాలోనే అర్హులైన నీర్పేతులందరికీ ఆహార భద్రత కార్డులను అందజేశారని అన్నారు. అంతేకాకుండా నిరుపేదలు దొడ్డు బియ్యం తింటున్నారని ఉద్దేశంతో మనిషికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.మహిళల కోసం ఉచిత కరెంటు, వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా..
వెలిశాల గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. సర్పంచ్ గా గెలిచినంక గ్రామంలో సిసి రోడ్లు, నూతన గ్రామపంచాయతీ భవనం, వంటి అనేక అభివృద్ధి పనులు చేశానని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాల అతీతంగా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తా...
గ్రామంలో కళాశాలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వృద్ధులకు బస్సు లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని అన్నారు.
ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజా సమస్యలు తీరుస్తా...
గ్రామపంచాయతీ రాకుండా తానే స్వయంగా ప్రజల మధ్యలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.
బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేస్తాం.. మండల అధ్యక్షుడు సుంకర జనార్ధన్..
వెలిశాల గ్రామానికి బతుకమ్మ సందర్భంగా మహిళలు ఆడుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే సామెత గారికి తీసుకువెళ్లి బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేస్తానని అన్నారు.రొండో విడుత ఇందిరమ్మ ఇళ్లలను గ్రామాల్లో 25 ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే చొరవుతో అర్హులైన ప్రజలందరికీ అందిస్తామని అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ,బిజెపి నాయకులు ధర్నాలు చేపడుతున్నారని అన్నారు. గత పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క ఇల్లు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినంక రెండు సంవత్సరాల్లోనే ప్రతి గ్రామానికి అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళను కట్టించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, అంతేకాకుండా సన్న వడ్ల కు కింటాకు 500 రూపాయలు బోనస్ ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కల్పించిన విధంగా రైతులకు 500 రూపాయల బోనస్ కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ షేక్ జాన్ మమ్మద్, ఉప సర్పంచ్ వెంకటమ్మ, పాలకవర్గ సభ్యులు, తిరుమలగిరి మున్సిపాలిటీ కౌన్సిలర్ యాదగిరి, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుభద్ర, మహిళా సంఘం అధ్యక్షురాలు పులిమామిడి శోభ, వివో ఆకల సరస్వతి, మహిళా సంఘం నాయకురాలు చిత్తలూరు జ్యోతి, రేషన్ డీలర్ ఆకుల మంజుల, నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు సంకేపల్లి దామోదర్ రెడ్డి గౌడ్ చర్ల చిన్న గౌడ్ షేక్ సైదా, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి