చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఆటో కిరాయికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి రాని ఘటన మండల పరిధిలోని కుంట్లగూడెంలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కుంట్లగూడెం గ్రామానికి చెందిన గువ్వల నరసింహ (42) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల ఆటో ఈఎంఐ (ఫైనాన్స్ వాయిదా) చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.ఈ క్రమంలో ఈ నెల 1న ఉదయం 11 గంటల సమయంలో ఆటో కిరాయికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి భార్య శశికళ బుధవారం చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అదృశ్యమైన నరసింహ ఐదు అడుగుల ఎత్తు, తెల్లని రంగు కలిగి ఉంటాడని, ఇటువంటి ఆచూకీ తెలిస్తే చౌటుప్పల్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి