నకిరేకల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా ఏం ఇచ్చారో చెప్పాలి: చిరుమర్తి లింగయ్య.
నకిరేకల్: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బుధవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ నిరసన, ధర్నా నిర్వహించాయి. ఆరు గ్యారంటీల వైఫల్యం, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల అమలు తీరును ప్రశ్నిస్తూ 420 అడుగుల ఫ్లెక్సీ, 1000 రోజుల బాకీ కార్డులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో మంజూరైన పనులను కొనసాగించి ప్రారంభించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం నకిరేకల్‌కు కొత్తగా చేసిందేమిటని ప్రశ్నించారు.
ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి బీఆర్‌ఎస్ హయాంలోనే మంజూరైందని, దానికి రిబ్బన్ కట్ చేయడం కాకుండా నకిరేకల్‌కు కొత్తగా ఏం ఇచ్చారో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, పేదలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి