నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని ముకుంద నాయక్ తండాలో శివలాల్ మహారాజ్ దీక్ష కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవింద్ మహారాజ్, పూజారి బిక్కు నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 41 రోజుల దీక్ష సెప్టెంబర్ 5, 2026న ప్రారంభం కానుండగా, పోరాదేవి శేఖర్ మహారాజ్ చేతుల మీదుగా భక్తులు దీక్ష స్వీకరించనున్నారు. అలాగే 21 రోజుల దీక్ష సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. దీక్ష విరమణ కార్యక్రమాన్ని అక్టోబర్ 15న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీక్షలో పాల్గొనే భక్తులు నియమ నిష్ఠలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి కంగ్టి మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, శివలాల్ మహారాజ్‌పై విశ్వాసంతో దీక్ష తీసుకునే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోవింద్ మహారాజ్, పూజారి బిక్కు నాయక్ కోరారు.
శివలాల్ మహారాజ్ దీక్షలకు ఆహ్వానం.. అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి