చౌటుప్పల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
బిజెపి నేతల ఆగ్రహం... కాంగ్రెస్ తీరుపై నిరసన జ్వాలలు
నల్గొండలోని బిజెపి జిల్లా కార్యాలయంపై, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడులను నిరసిస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ చౌరస్తాలో బిజెపి శ్రేణులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, సీనియర్ నేతలు మాట్లాడుతూ... బిజెపి ఆఫీసుపై రాళ్లు రువ్వి ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా, జిల్లా అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి ఆయన తల్లి, మామయ్యపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలపై కాంగ్రెస్ శ్రేణులు రౌడీయిజానికి పాల్పడుతున్నాయని, ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం గౌడ్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనా యాదవ్, సీనియర్ నాయకులు రమణగోని శంకరయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉబ్బు బిక్షపతి, బాతరాజు సత్యం, పోలోజు శ్రీధర్ బాబు, కౌన్సిలర్లు బుడ్డ సురేష్, పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, నాయకులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఉడుగు యాదయ్య గౌడ్, కాసుల వెంకటేశం, ఆలే చిరంజీవి, దిండు భాస్కర్, పబ్బు వంశీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి