Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 04:25 PM

బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం

01-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఖబర్దార్ కాంగ్రెస్ గూండాల్లారా: శాగ చంద్రశేఖర్ రెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడటం తీవ్ర అహంకారానికి, అరాచక రాజకీయాలకు పరాకాష్ట అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శాగ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అధికారం ఉందని విర్రవీగొద్దు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని హెచ్చరించారు. ​కాంగ్రెస్ నాయకులు రౌడీల మాదిరిగా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. “ఇది మీకు హెచ్చరిక కాదు.. తుది హెచ్చరిక. బీజేపీ జోలికి వస్తే ప్రజాస్వామ్య పద్ధతిలోనే గట్టిగా బుద్ధి చెబుతాం. ఖబర్దార్ కాంగ్రెస్ గూండాల్లారా.. బెదిరించాలని చూస్తే మీకే ఎదురుదెబ్బ తప్పదు” అని స్పష్టం చేశారు.​చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ని భౌతిక దాడులు చేసినా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు.

Sthanikam

బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News