Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:50 PM

అనాథ చిన్నారులకు అండగా గురుకుల్ విద్యార్థులు

31-08-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట, ఆగస్టు 31: సమాజ సేవ పట్ల బాధ్యత, సేవా భావాన్ని చాటుతూ సూర్యాపేట దురాజ్‌పల్లి సమీపంలోని శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండ్రుగొండ సమీపంలోని పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం సూర్యాపేటలోని చార్లెట్ పిల్లల అనాథాశ్రమాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో కొంత సమయం గడిపారు.

ఈ సందర్భంగా అనాథాశ్రమంలోని చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు తదితర విద్యా సామగ్రిని అందజేశారు. విద్యార్థులు చిన్నారులతో ఆప్యాయంగా మమేకమై వారితో మాట్లాడారు. వారి చదువు, భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ ప్రోత్సాహాన్ని అందించారు. చిన్నారులతో కలిసి సమయం గడిపి వారిలో ఆనందాన్ని నింపారు.

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే సేవా భావం, సామాజిక బాధ్యత, మానవీయ విలువలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. ‘సేవే పరమో ధర్మః’ అనే సందేశాన్ని ఆచరణలో చూపించేలా విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం అని తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సీహెచ్. శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ అనాథ చిన్నారులతో సమయం గడపడం ద్వారా విద్యార్థుల్లో ప్రేమ, ఆదరణ, సేవా భావం పెంపొందుతాయని తెలిపారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం విద్యార్థులకు సంతృప్తిని కలిగించిందన్నారు. సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలవాలనే ఆలోచన విద్యార్థుల్లో పెంపొందించేందుకు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, అనాథాశ్రమ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

అనాథ చిన్నారులకు అండగా గురుకుల్ విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News