ముత్యాలమ్మ, మారమ్మ అమ్మవార్లకు ఘనంగా పూజలు.. భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ.
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో బోనాల పండుగను సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ముత్యాలమ్మ, మారమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుని అమ్మవార్లకు సమర్పించారు.
ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మికతతో పాటు పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవార్ల కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు కోరుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి