నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశం నిర్వహించి, ఎస్‌ఐఆర్ ఫేజ్–2 ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గాంధీ భవన్ నుంచి విచ్చేసిన మాస్టర్ శిక్షకుడు, ఎస్‌ఐఆర్ సమన్వయకర్త శ్రీ మాణిక్యం మల్లేష్ యాదవ్ ఓటర్ల జాబితా పరిశీలన, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చూడటం, అవసరమైన సవరణలు చేపట్టడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బూత్ స్థాయి ఏజెంట్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.ఎస్‌ఐఆర్ ఫేజ్–2 ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు.
నారాయణఖేడ్ లో ఎస్‌ఐఆర్ ఫేజ్–2పై బూత్ స్థాయి ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి